![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -373 లో....సీతాకాంత్ రామలక్ష్మి బయటకు వస్తారు. అదే సమయంలో కార్ పంచర్ అవ్వడం తో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. మీరు నడవలేరు నేను ఎత్తుకుంటా అని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదని రామలక్ష్మి నడుస్తుంటుంది. దాంతో రామలక్ష్మి కిందపడబోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. నేను చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన కాలు పట్టుకొని నిమురుతుంటే రామలక్ష్మి కావాలనే నొప్పి అంటుంది.
దాంతో రామలక్ష్మి కావాలనే చేస్తుందని అర్ధమవుతుంది. ఈ కర్ర తో కొడితే నొప్పి తగ్గిపోతుందని సీతాకాంత్ అనగానే నొప్పి లేదు ఏం లేదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక పెద్దాయన ఇంటికి వెళ్తారు. అక్కడ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం చూసి ముచ్చట పడతారు. మీరు భార్యాభర్తలు కదా అంటూ సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిని మాట్లాడనివ్వకుండా వాళ్లే మాట్లాడతారు. మీరు ఏంటి ఇంత దూరంగా ఇలా బ్రతుకుతున్నారు అని రామలక్ష్మి వాళ్ళని అడుగుతుంది. మేమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. ఇంట్లో వాళ్ళని ఎదురించి చేసుకున్నాం చేసుకున్నాక కూడా మేమ్ చాలా సమస్యలు ఎదుర్కున్నామని వాళ్ళు చెప్తారు.
కానీ మేం కలిసి ఉంటే ఇద్దరిలో ఒకరు బ్రతకరని చెప్పారు కానీ మేమ్ ఒక్క దగ్గర ఒకే రోజున్నా చాలు అని ఇలా జీవనం సాగిస్తున్నామని వాళ్ళు చెప్తారు. అది వినగానే రామలక్ష్మి పక్కకి వచ్చి నేనే అనవసరంగా సీతా సర్ ని దూరం పెడుతున్నానని బాధపడుతుంది. ఆ తర్వాత భోజనం చెయ్యండి అని వాళ్ళు అంటారు. వద్దని సీతాకాంత్.. చేస్తామని రామలక్ష్మి అంటుంది. భోజనం ఒకే ప్లేట్ తీసుకొని వస్తారు. అందులో ఇద్దరు తినండి అని చెప్తారు. ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం తింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |